
చెన్నై జట్టుకి మరో బిగ్ షాక్.. అతను కూడా దూరం కాబోతున్నాడట?
అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఇక ఎంతో మంది కొత్త ఆటగాళ్లను కూడా జట్టులోకి చేర్చుకొని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ధోని కెప్టెన్సీ లో వరుసగా రెండోసారి చెన్నై టైటిల్ గెలుస్తుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ప్రారంభానికి ముందే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించిన ఓపెనర్ డేవన్ కాన్వే ఇక ఈ ఏడాది ఐపీఎల్ ప్రారమానికి ముందే గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
దీంతో అతని స్థానంలో మరొక ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మరో బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతూ ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న మరో ఆటగాడు దూరం కానున్నట్లు సమాచారం. శ్రీలంక యంగ్ బౌలర్ పతీరణ గాయంతో ప్రారంభ మ్యాచ్ లకు దూరం కాబోతున్నాడట. ఈ 21 ఏళ్ల బౌలర్ స్నాయువు గాయంతో బాధపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయ్. దీంతో కనీసం నాలుగు నుంచి ఐదు వారాల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే గత సీజన్లో ఏకంగా 19 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ యువ బౌలర్ చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు.