సగం ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తారా.. క్లారిటీ ఇచ్చిన జై షా?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఇక మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . అయితే ఇక ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేసేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు. ప్రస్తుతం ఇండియా క్రికెట్లో ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ అటు ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. కానీ కేవలం మొదటి విడత షెడ్యూల్ ని మాత్రమే విడుదల చేసింది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో .. ఐపీఎల్ ఇండియాలో జరుగుతుందా లేదా అనే విషయంపై ఎన్నో రోజులుగా చర్చ జరిగింద. అయితే ఈ చర్చకు తెర దింపుతూ ఇక మొదటి విడత ఐపిఎల్ షెడ్యూల్ ని విడుదల చేసింది బీసీసీఐ. కాగా ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్ రెండో విడత మ్యాచ్లు అటు విదేశాలలో జరిగే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైంది.యూఏఈ వేదికగా ఈ మ్యాచ్లను నిర్వహించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.

 ఇక ఈ వార్తల నేపథ్యంలో ఇదే విషయంపై అటు బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం కూడా భారత్లోనే జరుగుతుంది అంటూ జై షా స్పష్టం చేశాడు. త్వరలోనే సెకండ్ ఫేస్ షెడ్యూల్ ని కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. ఐపిఎల్ నిర్వహణపై వచ్చే వదంతులను నమ్మొద్దు అంటూ ప్రేక్షకులకు సూచించాడు. దీంతో ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ ని ప్రత్యక్షంగా మ్యాచ్ చూసి  ఎంజాయ్ చేయాలి అనుకున్న ఎంతోమంది ప్రేక్షకులకు.. జై షా వ్యాఖ్యలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి అని చెప్పాలి. కాగా ఈసారి ఐపీఎల్లో మొత్తంగా 10 టీమ్స్ బరిలోకి దిగుతూ ఉండగా.. టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: