ఫ్యాన్స్ కి షాక్.. ఆర్సిబి మ్యాచ్ లు.. బెంగళూరు నుంచి వైజాగ్ కి?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కి సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా క్రికెట్ ప్రేక్షకుల దగ్గర నుంచి విశ్లేషకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. అయితే తమ జట్టు ఈసారి టైటిల్ విజేతగా నిలుస్తుంది అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటే ఈసారి విజేతగా నిలవబోయే జట్టు ఏది అనే విషయంపై ఎంతో మంది విశ్లేషకులు రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మరోవైపు అటు అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్టును టైటిల్ విజేతగా నిలపడమే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి.

 ఇక ఇప్పటికే అన్ని జట్లు కూడా ఫ్రీ సీజన్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరిగా ఆటగాళ్లను క్యాంపులో చేర్చుకుంటూ ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ నిర్వహణ విషయంలో గత కొంతకాలం నుంచి కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. పార్లమెంటు ఎలక్షన్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. ఈ క్రమంలోనే అటు బీసీసీఐ కూడా పూర్తిస్థాయి షెడ్యూల్ కాకుండా కేవలం సగం షెడ్యూల్ని మాత్రమే విడుదల చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత మిగతా షెడ్యూల్ ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇలా పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఐపీఎల్ నిర్వహణకు కాస్త ఆటంకం ఏర్పడుతుంది.

 ఇక ఇప్పుడు ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్లు నిర్వహణ విషయంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీరు లేక ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. టాయిలెట్స్ కోసం మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకు క్యూ కడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ నీటి ఎద్దడి చివరికి ఐపీఎల్ పై ప్రభావం చూపుతుందని.  సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను పూణే, విశాఖపట్నం స్టేడియాలకు తరలించే అవకాశం ఉంది అన్నది ప్రస్తుతం అందుతున్న సమాచారం అయితే కర్ణాటక క్రికెట్ బోర్డు మాత్రం ఇక ఈ విషయాన్ని ఖండిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: