ఇండియ vs పాక్ మ్యాచ్ ఫై.. పిసిబి చైర్మన్ షాకింగ్ కామెంట్స్?

praveen
భారత్ క్రికెట్ లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే పాకిస్తాన్, ఇండియా టీమ్స్ పేరును చెబుతూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ఉత్కంఠ మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే అందరూ కూడా ఈ దాయాదుల పోరును హై వోల్టేజ్ మ్యాచ్ గా తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే అన్ని దేశాల జట్లు ఆడినట్లుగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగవు. ఒక దేశం మరో దేశానికి పర్యటనకు వెళ్లడం పై కూడా నిషేధం కొనసాగుతూ ఉంది.

 ఇలా క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడుతూ ఉంటాయి అని చెప్పాలి. దీంతో ఎప్పుడో ఒకసారి జరిగే ఈ దాయాదుల పోరును చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక భారత్తో ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే భారత జట్టు కూడా అన్ని దేశాల జట్ల లాగానే పాకిస్తాన్ పర్యటనకు వచ్చి క్రికెట్ మ్యాచ్ లు ఆడాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 అయితే ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వి సైతం ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ రావాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయంపై త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ జైశాతో చర్చిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.  ఎలాగైనా ఆ టోర్నీలో భారత్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్తాన్ కు టీమిండియాని పంపేందుకు అటు బీసీసీఐ ససే మిరా అంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా బీసీసీఐ మొండిపట్టుతో ఉండడం కారణంగానే.  పాకిస్తాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ ను శ్రీలంక వేదికలుక నిర్వహించి.. టీమ్ ఇండియా అక్కడ మ్యాచ్ లు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: