అప్పుడు షూ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు.. టీమిండియా క్రికెటర్ ఎమోషనల్?

praveen
ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతూ వచ్చిన రంజి ట్రోఫీ ప్రస్తుతం తృతీయ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబై, విదర్భ జట్ల  మధ్య ఫైనల్ మ్యాచ్ హోరహోరీగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలిచి రంజీ ట్రోఫీ టైటిల్ అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ రంజి ఫైనల్ మ్యాచ్ ఇక తనకు చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అంటూ 35 ఏళ్ల టీమిండియా క్రికెటర్ ప్రకటించడం హాట్ టాపిక్గా మారిపోయింది. ఏకంగా 35 ఏళ్ళ దవల్ కులకర్ణి  ఇక ఈ రంజి మ్యాచ్ ముగిసిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో డబల్ కులకర్ణి ఇక అద్భుతమైన  ఆట తీరును కొనసాగించిన విధానం పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆటగాడు ఆటగాడు రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ముంబై జట్టు తరఫున ఆడుతున్న శార్దూల్ ఠాగూర్ సైతం దవల్ కులకర్ణి తో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఇప్పటికే అటు దవల్ కులకర్ణి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇక ఇప్పుడు విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఫేసర్ మోహిత్ అవస్థి గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో చివరికి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

 ఇకపోతే ఇటీవల దవల్ కులకర్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఇక శార్దూల్ ఠాగూర్ అతనితో ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. కులకర్ణితో తన అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడు. ఒకప్పుడు నా దగ్గర షూ కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సమయంలో తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కులకర్ణి కెరియర్ ఆరంభంలో నాకు ఎంతో సహాయం చేశాడు  అతనితో స్నేహం నాకు దొరికిన అదృష్టం అంటూ శార్దూల్ ఠాగూర్ భావోద్వేగానికి లోనయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: