ఓరి నాయనో.. 24 గంటల్లో మూడు హ్యాట్రిక్ లు?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే ఉత్కంఠ భరితమైన ఆటకు కేరాఫ్ అడ్రస్. ఇక ఈ ఫార్మాట్లో ధనాధన్ ఇన్నింగ్స్ లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక అందుకే ఇటీవల కాలంలో మిగతా ఫార్మాట్లతో పోల్చి చూస్తే టీ20 ఫార్మాట్ కి ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయితే ఇక పొట్టి ఫార్మాట్లో ఎంతో మంది ఆటగాళ్లు ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే పొట్టి ఫార్మాట్లో బౌలింగ్ వేసే ప్రతి బౌలర్ కూడా ప్రతి బంతికి వికెట్ పడగొట్టాలి అనే లక్ష్యంతోనే బంతిని సంధిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే మిగతా ఫార్మట్లతో పోల్చి చూస్తే అటు టి20 ఫార్మాట్లో వికెట్లు తీయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవాలి అనే మైండ్ సెట్ తో ఉండే బ్యాట్స్మెన్ లను తికమక పెట్టి వికెట్ దక్కించుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఇక టి20 ఫార్మాట్లో హ్యాట్రిజ్ కొట్టడం అంటే ఇక ఆ ఆటగాడికి ఆరోజు అదృష్టం కలిసి వచ్చినట్లే. ఇలా ఎవరైనా ఆటగాడు టి20 ఫార్మాట్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు అంటే చాలు ఇక అతని గురించి అందరూ చర్చించుకుంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఇలాగే హ్యాట్రిక్ నమోదయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 గంటల వ్యవధిలోనే మూడు హ్యాట్రిక్ లు నమోదు అయ్యాయి అని చెప్పాలి.

 ఇందుకు సంబంధించిన విషయం తెలిసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. తొలుత పాకిస్తాన్ సూపర్ లీక్ లో షెఫవార్ జల్మి తో జరిగిన మ్యాచ్లో గ్లాడియేటర్స్ బౌలర్ అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్  సాధించాడు. ఇక ఆ తర్వాత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయింది. ఇక ఇటీవలే శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కూడా మరో హ్యాట్రిక్ నమోదయింది అని చెప్పాలి. లంక బౌలర్ నువాన్ తుషార ఇలా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు. ఇలా t20 ఫార్మాట్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు హ్యాట్రిక్ లు  నమోదు అయ్యాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: