సెంచరీ చేసినా.. గిల్ తండ్రి హ్యాపీగా లేరట.. షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా కొడుకు ఏదైనా సాధించినప్పుడు ఇక తండ్రికి ఉండే ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెటర్ గా కొనసాగుతున్న కొడుకు ఏకంగా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. సెంచరీ చేస్తే ఆ తండ్రి మనసులో సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో శుభమన్ గిల్ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. కానీ గిల్ చేసిన సెంచరీపై అతని తండ్రి మాత్రం అస్సలు సంతోషంగా లేడట.

 అయితే గత పది ఇన్నింగ్స్ లలో కూడా కనీసం 50 కూడా సాధించలేకపోవడంతో గత కొంతకాలం నుంచి గిల్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలకు ఇక ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులోనే చెక్ పెట్టేసాడు. సెంచరీ చేయడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇక ఇప్పుడు ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లోను అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు. అయితే గిల్ సెంచరీ కొట్టిన అతని తండ్రి మాత్రం హ్యాపీగా లేడట. దానికి కారణం గిల్ చేసిన ఒక పెద్ద తప్పు అని తెలుస్తుంది.

 గిల్ తండ్రి లిక్విందర్ ఎందుకు సంతోషంగా లేడు.. అనే విషయంపై ఒక బలమైన కారణం తెర మీదకి వచ్చింది. గిల్ తీసుకున్న నిర్ణయం అతని తండ్రికి నచ్చలేదట. గిల్ గత కొన్ని రోజుల నుంచి టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్ గా కాకుండా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గిల్ తండ్రికి అస్సలు నచ్చలేదట. ఇలా ఓపెనర్ స్థానం నుంచి వన్ డౌన్ కి తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకోవడం పెద్ద తప్పని.. అతని తండ్రి, చిన్ననాటి కోచ్ లిక్విందర్ సింగ్ తెలిపాడట. ఇలా వన్ డౌన్ లో రావడం వల్ల గిల్ వరుసగా పది ఇన్నింగ్స్ లలో ఒక అర్థ శతకం కూడా సాధించలేకపోయాడు అంటూ గిల్ తండ్రి అసంతృప్తితో ఉన్నాడట. డ్రెస్సింగ్ రూమ్ లో ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత ఒత్తిడి పెరుగుతుందని.. అయితే గిల్ నిర్ణయంలో మాత్రం నేను జోక్యం  చేసుకోను. ఎందుకంటే ఇప్పుడు అతను పెద్దవాడు అయ్యాడు అంటూ గిల్ తండ్రి లిక్విందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: