ఇండియన్ క్రికెట్లో ఒకే ఒక్కడు.. క్యాచ్లు పట్టడం లోను రోహిత్ తోపే?

praveen
హిట్ మ్యాన్.. ఈ బిరుదును భారత క్రికెట్ ప్రేక్షకులు ఎవరికి ఇచ్చారో మీకు తెలిసే ఉంటుంది. ఇంకెవరు ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు. ఇక రోహిత్ శర్మకు హిట్మ్యాన్ అనే పేరు ఊరికే రాలేదు. అతని బ్యాటింగ్ విధ్వంసం చూసి ఇలాంటి బిరుదును కట్టబెట్టేశారు ప్రేక్షకులు. అయితే బ్యాటింగ్లో ఒక్కసారి రోహిత్ శర్మ కుదురుకున్నాడు అంటే ఎంత ప్రమాదకరంగా మారిపోతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలా వికెట్ల మధ్య పరుగులు పెట్టడం కాదు.. ఏకంగా బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ సీనియర్ ప్లేయర్. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఇక రోహిత్ విధ్వంసం సృష్టించాడు అంటే స్కోరుబోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతూ ఉంటుంది. అంతలా అదరగొడుతూ ఉంటాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ ఎంతో అలవోకగా డబుల్ సెంచరీలు బాధేస్తూ ఇప్పటికే తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు ఈ ఆటగాడు. అయితే బ్యాటింగ్లో రోహిత్ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఫీల్డింగ్ లో కూడా రోహిత్ శర్మ తోపే అన్న విషయం ఇటీవల తెర మీదికి  వచ్చింది. మరీ ముఖ్యంగా క్యాచ్లు పట్టడంలో రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డును ఇటీవలే ఖాతాలు వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత రోహిత్ ఖాతాలో చేరిపోయింది.

 ఇలా ఇప్పటివరకు బ్యాటింగ్లో రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ లో కూడా సరికొత్త ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో వుడ్ ఇచ్చిన క్యాచ్ ని పట్టడంతో కొత్త రికార్డు రోహిత్ ఖాతాలో చేరిపోయింది. మూడు ఫార్మాట్లలో కనీసం 60 లేదా అంతకుమించి క్యాచ్లు పట్టిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో 93 క్యాచ్లు పట్టిన రోహిత్ టీ20 ఫార్మాట్లో 60 క్యాచ్ లు అందుకున్న రోహిత్ శర్మ ఇక ఇటీవల చివరి టెస్టులో వుడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా టెస్ట్ ఫార్మాట్లోను 60 క్యాచ్ లు  అందుకున్న ప్లేయర్గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: