ఐపీఎల్ హిస్టరీలో.. ఓకే వేదికపై ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్స్ వీళ్లే?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 22వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్ని జరగబోతుంది.  ఇక ఈ ఐపీఎల్ సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన మొదటి విడత షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏ జట్టు ఏ వేదికపై ఏ ప్రత్యర్థి తో తలబడబోతుంది అనే విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఐపిఎల్ టోర్నీ ప్రారంభానికి అంత సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇస్తున్న రివ్యూలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో వివిధ జట్లు కొంతమంది ఆటగాళ్లు జట్టు నుంచి వదిలేసి కొత్త ఆటగాళ్లని జట్టులో చేర్చుకున్నాయి ఇక ప్రస్తుతం ఆయా జట్లకు ఉన్న బలాబలాల దృశ్య ఏ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది అనే విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయంపై ఎంతో మంది రివ్యూలు కూడా ఇస్తున్నారు. అదే సమయంలో ఐపీఎల్ హిస్టరీలో ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

 కాగా ఈ లిస్టులో విరాట్ కోహ్లీ 2,700 పరుగులతో టాప్ లో ఉన్నాడు చిన్న స్వామి స్టేడియంలో కోహ్లీ ఇలా అత్యధిక పరుగులు సాధించాడు. ఇక ఆ తర్వాత ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంకడే  స్టేడియంలో 2020 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక దివిలియర్స్ చిన్న స్వామి స్టేడియంలో 1960 పరుగులు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో 1623 పరుగులు చేశాడు. గేల్ చిన్నస్వామి స్టేడియంలో 1561, సురేష్ రైనా చేపాక్ స్టేడియంలో 1498, శిఖర్ ధావన్ ఉప్పల్లో 1477, ధోని చపాక్ స్టేడియంలో 1455 పరుగులతో ఇక ఒకే గ్రౌండ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: