తాత కావాల్సిన వయసులో.. తండ్రైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లకు ఇక సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆయా ప్లేయర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇటీవల మూడోసారి తండ్రి అయ్యాడు ఈ పాకిస్తాన్ మాజీ బౌలర్.  ఇక ఎన్నో ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్ ప్రాతినిధ్యం వహించి రావల్ పిండి ఎక్స్ప్రెస్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు  అయితే ఇక ఇప్పుడు మూడో బిడ్డకు తండ్రి అయ్యాడు ఈ మాజీ ప్లేయర్. అక్తర్ - రుబాబ్ దంపతులకు ఇప్పటికే మహమ్మద్ మైఖేల్ అలీ, మహమ్మద్ మజ్జాద్  అలీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2016లో పెద్ద కొడుకు  2019లో చిన్న కుమారుడు జన్మించాడు. ఇక ఇటీవల మూడో సంతానంగా అమ్మాయి పుట్టింది.

 కాగా చిన్నారికి నూరే అలీ అక్తర్ అనే పేరు పెట్టారు   కాగా 2014లో షోయబ్ అక్తర్-  రుబాబ్ లు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయానికి షోయబ్ అక్తర్ వయసు 38 ఏళ్లు కాగా రుబాబ్ వయసు 20 ఏళ్ళు మాత్రమే. తనకంటే 18 ఏళ్ళు చిన్నదైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇకపోతే తన కూతురు పుట్టిన విషయాన్ని షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతోమంది అటు అతనికి సోషల్ మీడియాలో కంగ్రాజులేషన్స్ చెబుతూ ఉంటే.. కొంతమంది మాత్రం తాత కావాల్సిన వయసులో తండ్రి అయ్యాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనర్హం. కాగా ప్రస్తుతం షోయబ్ అక్తర్ వయసు 48 ఏళ్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: