అశ్విన్ మామూలోడు కాదు.. ఆ లెజెండ్ రికార్డును సమం చేసేసాడు?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన ఆటతీరుతో ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతోమంది యువ ఆటగాళ్ల రాకతో ఇక సీనియర్ ప్లేయర్లకు పెద్దగా ఛాన్సులు లేకుండా పోయాయి. కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఇక తన ఆటతీరుతో ఎప్పుడు తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు. మరి ముఖ్యంగా భారత జట్టు టెస్ట్ ఫార్మాట్ లో ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు.. అశ్విన్ ఇక టీమిండియాలో తప్పక స్థానం దక్కించుకుంటున్నాడు.

 ఇలా వచ్చిన అవకాశాలను కూడా అతను బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఏకంగా తన అనుభవాన్ని అంతా రంగరించి ఇక కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయాలలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో వరుసగా టెస్ట్ సిరీస్ లు ఆడుతూ ఉండగా.. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక బౌలింగ్ తో ఇరగదీస్తున్న అశ్విన్ అటు బ్యాటింగ్ లోను తనకు ఎక్కడ తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్.

 మొన్నటికి మొన్న టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సీనియర్ బౌలర్ మరో ఘనతను అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. ఆయన 35 సార్లు ఐదు వికెట్లు తీయగా.. ఇక ఇటీవల రాంచి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయడంతో అశ్విన్ ఈ రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్.. 67 సార్లు ఇలా ఐదు వికెట్ల హాల్ అందుకున్న ప్లేయర్గా టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: