ఇతను క్రికెట్ బాహుబలి.. ఒంటి చేత్తో బ్యాటింగ్.. ఎలా సిక్సర్లు కొట్టాడో చూడండి?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఎన్నో రకాల షాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది స్టార్ బ్యాట్స్మెన్లు ఎప్పటికప్పుడు వినూత్నమైన షాట్లతో ఇక ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఇలా ప్రొఫెషనల్ క్రికెట్లో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఎవరైనా సరే ఇక సిక్సర్లు కొట్టడానికి కాస్త కష్టపడి పోతూ ఉంటారు. ఇక ఎంతో టెక్నిక్ తో సిక్సర్లు కొట్టి బంతిని స్టేడియం బయటికి తరలించడానికి ఇంకొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 మరి కొంతమంది మాత్రం ఏకంగా భారీ సిక్సర్ కొట్టాలని ప్రయత్నించి చివరికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇలా రెండు చేతులతో సిక్సర్లు కొట్టడమే కాస్త కష్టం అని చెబుతూ ఉంటారు ఆటగాళ్లు. కానీ ఇక్కడొక ఆటగాడు మాత్రం రెండు చేతులతో కాదు కేవలం ఒంటి చేత్తో అదిరిపోయే సిక్సర్ కొట్టాడు. అయితే ఇప్పుడు వరకు టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్, లియాన్ లివింగ్ స్టోన్ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టడం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. ఈ క్రమంలోనే సదరు స్టార్ ప్లేయర్స్ కొట్టిన సిక్సర్లు చూసి వారికి ఈ రేంజ్ లో పవర్ ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రేక్షకులు.

 అయితే ఇక ఇప్పుడు ఇలాగే ఒంటి చేత్తో సిక్సర్ల సునామీ సృష్టించాడు ఒక ఆటగాడు. అయితే అతను కేవలం వంటి చేత్తోనే బ్యాటింగ్ చేయడం గమనార్హం. స్పెయిన్ కి చెందిన మహమ్మద్ బాబర్ ఇలా తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ బ్యాట్స్మెన్ కేవలం ఒంటి చేత్తో భారీ సిక్సర్ లను కొట్టడం ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడొచ్చు. ఏకంగా వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇది చూసిన ఎంతోమంది క్రికెట్ లవర్స్ అతన్ని బాబర్ బాహుబలి అని పిలుస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల చెక్ రిపబ్లిక్ వర్సెస్ స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇక అతను ఒంటి చేత్తో సిక్సర్ల సునామీ సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: