షాకింగ్ : ఒకేసారి ఐదుగురు క్రికెటర్ల రిటైర్మెంట్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే  నేటి రోజుల్లోఎంతోమంది యువకులు క్రికెట్ ను ఫ్యాషన్ గా మార్చుకొని.. ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఎంతోమంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రతిభతో టీమిండియాలో కూడా ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ క్రికెటర్లుగా ఎదుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో చాలా మంది సీనియర్ ప్లేయర్లను సెలెక్టర్లు జట్టు ఎంపిక విషయంలో అస్సలు పరిగణలోకి తీసుకోవట్లేదు.

 ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ ఆడి అటు మంచి ప్రదర్శన చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాము అని నిరూపించుకున్నప్పటికీ ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు మాత్రం మళ్ళీ భారత జట్టులోకి రాలేకపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందేమో అని ఎదురుచూసి చివరికి రిటైర్మెంట్కు సిద్ధమవుతున్నారు చాలామంది క్రికెటర్లు. అయితే ఇటీవల ఏకంగా భారత క్రికెట్లో ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ ఏడాది రంజి సీజన్ తర్వాత ఏకంగా ఐదుగురు దేశవాళి  క్రికెటర్లు రిటైర్ కాబోతున్నారు అని చెప్పాలి. బెంగాల్ కు చెందిన మనోజ్ తివారి, ఝార్ఖండ్ కు చెందిన సౌరబ్ తివారి, జార్ఖండ్ కు చెందిన వరుణ్ అరుణ్, ముంబైకి చెందిన ధవల్ కులకర్ణి, విదర్భకు చెందిన ఫయాజ్ ఫజల్ ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఒకప్పుడు టీమిండియాకు ఈ ఐదుగురికి క్రికెటర్లు కూడా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం అద్భుతంగా రానించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసారు అని చెప్పాలి. ఇలా అయిదుగురు క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: