ఐపీఎల్ హిస్టరీలో.. గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇక చాంపియన్ టీమ్స్ ఏవి అంటే ముందుగా రెండు జట్ల పేరునే చెబుతూ ఉంటారు అందరూ. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్స్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పేర్లు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఇలా ఐదు సార్లు టైటిల్ విజేతలుగా నిలిచాయి. ఇక ఇద్దరు కూడా గ్రేట్ కెప్టెన్లుగా గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా తాము సారథ్యం వహిస్తున్న జట్లకు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీలలో ఐపీఎల్ హిస్టరీ ఆధారంగా ఎవరు గ్రేటెస్ట్ కెప్టెన్ అంటే చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇద్దరు కూడా తమ జట్టును తమ కెప్టెన్సీ తో ఎంతో అత్యుత్తమంగానే ముందుకు నడిపించారు. అయితే రోహిత్ కంటే కెప్టెన్సీ విషయంలో ధోని ఒక మెట్టు పైన ఉన్నాడు. రోహిత్ 5 సార్లు టైటిల్ గెలిచిన మాట వాస్తవమే. కానీ ధోని తన జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించడమే కాదు ఎక్కువసార్లు ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అంతేకాదు ఇక చెన్నై జట్టు మిగతా జట్లతో పోల్చి చూస్తే ఎక్కువసార్లు ప్లే ఆఫ్ కి కూడా క్వాలిఫై అయ్యేలా చేసాడు. అయితే ఇటీవల పలువురు క్రికెట్ దిగజాల మధ్య ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తింది.

 అయితే ఇదే విషయంపై స్పందించిన ఎంతోమంది మాజీ ప్లేయర్లు ఇక ఐపీఎల్లో గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అని తేల్చారు. చెన్నై కెప్టెన్ ధోని, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ పేర్లను ఇక గ్రేటెస్ట్ కెప్టెన్ లిస్ట్ లో ప్రతిపాదించుగా మిస్టర్ కూల్ వైఫై మాజీ క్రికెటర్లు మొగ్గు చూపారు. స్టార్ జ్యూరీ డెయిల్ స్టేయిన్, టామ్ మూడి, వసీం అక్రమ్, మాథ్యూ హెడెన్ ఏకగ్రీవంగా ధోనినే గ్రేటెస్ట్ కెప్టెన్ అని తేల్చారు. అయితే వీరిద్దరి నాయకత్వంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు టైటిల్స్ గెలిచినప్పటికీ.. రోహిత్ శర్మతో పోల్చి చూస్తే అటు చెన్నై జట్టును ధోని మరింత సమర్థవంతంగా ముందుకు నడిపించాడు అంటూ సదరు మాజీ ప్లేయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: