టీమిండియాలో ఒకే ఒక మ్యాచ్ ఆడి.. రిటైర్మెంట్ ప్రకటించాడు?

praveen
ఏ రంగంలో అయినా సరే సరైన అవకాశాలు రావాలి అంటే.. వృద్ధి లోకి రావాలి అంటే టాలెంట్, హార్డ్ వర్క్ ఎంత ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు అదృష్టం కూడా కలిసి రావాలి అని చెబుతూ ఉంటారు. ఇలాంటి అదృష్టం లేక ఎంతో మంది టాలెంట్ ఉన్నవారు తెరమీదకి రాకుండా కనుమరుగు అవుతూ ఉంటారు. అయితే క్రికెట్ లో కూడా ఈ రూల్ వర్తిస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కొంతమంది క్రికెటర్లను చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
 అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు అందరూ. ఇక టీమ్ ఇండియా జట్టులో వచ్చిన ఛాన్స్ లను యువ ఆటగాళ్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పాలి.  ఇలా జట్టులోకి వచ్చి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్నో ఏళ్లపాటు టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం దేశవాళి క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియాలో అడపా దడప్ప అవకాశాలను మాత్రమే దక్కించుకుంటున్నారు. ఇలాంటివారు చివరికి నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించడం ఎన్నోసార్లు చూశామూ.

 అయితే ఇప్పుడు ఓ ఆటగాడు ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు.  భారత జట్టు తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడిన ఫైజ్ పజిల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతు నిర్ణయం తీసుకున్నాడు. కాక టీమిండియా తరఫున కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన పజిల్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత అతనికి టీం ఇండియా నుంచి ఎక్కడ అవకాశాలు రాలేదు. కొన్నిసార్లు జట్టుకు సెలెక్ట్ అయినా బెంచ్ కే పరిమితం అయ్యాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం అదరగొట్టాడు. విదర్భ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ లిస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అయితే విదర్భ జట్టు తరఫున ఇక 100 మ్యాచ్లు వాడిన ఏకైక ప్లేయర్ ఇతగాడే. అంతేకాకుండా ఒకసారి కెప్టెన్గా రంజీ ట్రోఫీ కూడా అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: