మా ఆటగాళ్లకు కాస్తయినా కామన్ సెన్స్ లేదు.. ఇంగ్లాండ్ మాజీ సంచలన వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. భారత పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఏకంగా సొంత గడ్డపై మొదటి మ్యాచ్ లోనే ఓడించింది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లలో మాత్రం డీలా పడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ టెస్ట్ ఫార్మాట్ లో అనుసరిస్తున్న బజ్ బాల్ అనే విధానం ఇక భారత పిచ్ లపై ఎక్కడ ఉపయోగపడలేదు. దీంతో ఇక భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పెవీలియన్ చేరడానికే క్రీజు లోకి వచ్చారేమో అన్న విధంగా పరిస్థితి కొనసాగింది. ఇక ఇటీవలే మూడో టెస్ట్ మ్యాచ్ లో అయితే ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది టీమిండియా. ఇక భారత జట్టుకు టెస్ట్ ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. అంతేకాకుండా 1964 తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు టెస్టు ఫార్మాట్లో ఇదే అతిపెద్ద ఓటమి కూడా. ఈ క్రమంలోనే చెత్త ప్రదర్శన చేసి దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొన్న ఇంగ్లాండ్ టీం పై ఆ దేశ మీడియా మొత్తం దుమ్మెత్తి పోస్తోంది. అక్కడి అభిమానులు ఈ ఓటమిని అస్సలు జీర్రించుకోలేకపోతున్నారు. ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్ల తీరుపై మాజీ ప్లేయర్లందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతూ ఉన్నారు అని చెప్పాలి.

 సాంప్రదాయమైన క్రికెట్లో ఎప్పుడు నుంచి కొనసాగుతున్న ఆటతీరును కాకుండా బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ తో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ జట్టు ఎన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతున్న తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కనీసం మ్యాచ్ ను డ్రా చేసేందుకు కూడా ప్రయత్నించలేదు అంటూ విమర్శల మీద విమర్శలు వస్తున్నాయి. అయితే  కామన్ సెన్స్ తో ఆడాలని మా వాళ్ళు ఎందుకు మర్చిపోయారో అర్థం కావట్లేదు అంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ లాంటి లెజెండ్స్ సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: