ఏం తిని చదివారు తల్లి.. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు?

praveen
ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రైవేట్ ఉద్యోగాలలో లక్షల జీతాలు వస్తున్న ఎందుకో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఆ కిక్కే వేరు అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద పీజీలు చదివిన వారి వరకు అందరూ కూడా ఇలా ఏకంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించేందుకు తెగ కష్టపడి పోతున్నారు. ఎప్పుడు ఏ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందా అని ఇక కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 కొంతమంది అయితే కుటుంబానికి దూరంగా వచ్చి హాస్టల్ రూమ్స్ లో ఉంటూ ఇక రోజంతా పుస్తకాల పురుగులలా మారిపోయి తెగ చదివేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలకు కూడా హాజరవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇంత కష్టపడి చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందా అన్నది మాత్రం గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. కేవలం 10 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయితే లక్షల మంది పరీక్షలు రాస్తూ ఉన్నారు. దీంతో ఎవరికి జాబ్ వరిస్తుంది అన్నది  ఊహించలేని పరిస్థితి నెలకొంది.

 ఇలా ఒక్క గవర్నమెంట్ జాబ్ సాధించడమే ఎంతో కష్టం అనుకుంటే ఇక్కడ మాత్రం ఇద్దరు మహిళలు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వరంగల్ మధ్య కోటకు చెందిన బండి హిమబిందు, ధర్మారానికి చెందిన కొప్పుల చైతన్య గత ఏడాది గురుకుల నియామక పరీక్షలు రాశారు. జూనియర్ డిగ్రీ కాలేజీలు స్కూల్ విభాగాల్లో ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీటిలో డిగ్రీ లెక్చరర్ పోస్టును ఎంచుకున్నారు. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీలో లైబ్రరీ సైన్స్ పోస్ట్ కి కూడా సెలక్ట్ అయ్యారు ఈ ఇద్దరు మహిళలు. దీంతో ఈ విషయం తెలిసి ఏం తిని ప్రిపేరేషన్ చేశారు తల్లి.. ఏకంగా ఒక్కరికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: