ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. జైష్వాల్ అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో చోటు సంపాదించుకుంటున్న ఎంతోమంది యువ ఆటగాళ్ళు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా ఇటీవల భారత జట్టులోకి అరంగేట్రం చేసిన యశస్వి జైష్వాల్ కూడా ఇలాగే తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. అందరిలా కాదు అందరికీ మించి సెంచరీలు డబల్ సెంచరీలు అంటూ చెలరేగిపోతూ ఉన్నాడు.

 టీమిండియా ఫ్యూచర్ తానే అంటూ ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ ఉంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఏకంగా వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధిస్తున్నాడు. ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో వన్డే తరహాలో  బ్యాటింగ్ చేస్తూ మెరుపులు మెరూపిస్తున్నాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలోనే ఇటీవల సిక్సర్లు కొట్టడం విషయంలో కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు బాది ఇరగదీసాడు.

 సాధారణంగా టెస్ట్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు తక్కువగా సిక్సర్లు కొట్టడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నెమ్మదిగా పరుగు రాబట్టడానికి ప్రయత్నిస్తారు తప్ప.. భారీ షాట్లు ఆడి వికెట్ సమర్పించుకోవడం ఎందుకని ఎవరు పెద్దగా రిస్క్ చేయరు. కానీ అలాంటి టెస్ట్ ఫార్మాట్లోనే యశస్వి జైష్వాల్ 12 సిక్సర్లు కొట్టాడు. అది కూడా ఓకే ఇన్నింగ్స్ లో. దీంతో ఇండియా తరఫున టెస్టు ఫార్మాట్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. తర్వాత స్థానంలో సిద్దు 8 సిక్సర్లు మయాంక్ 8 సిక్సర్లతో ఉన్నారు. ఓవరాల్ గా ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు  కొట్టి పాకిస్తాన్ ప్లేయర్ వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు జైష్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: