సీఎస్కే జెర్సీలోని రంగుల వెనుక.. ఇంత అర్థం ఉందా?

praveen
ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి ఇక హడావిడి మొదలైంది. బీసీసీఐ కూడా అన్ని సన్నాహాలు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి నెలలో ఇక ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. అయితే ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ఆటగాళ్లను క్యాంపుకు చేర్చుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపులో చేరి ప్రాక్టీస్ కూడా మొదలు పెడుతున్నాయ్ అని చెప్పాలి. అయితే గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతుంది.

 అయితే ఇలా ఐపిఎల్ 2024 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతూ ఉండగా.. ఒక కొత్త జెర్సీతో బరిలోకి దిగిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే కొత్త జెర్సీని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ న్యూ జెర్సీ ఎంతో అట్రాక్టివ్ గా ఉంది. ఇక ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై సరికొత్త రంగులు కూడా చేరిపోయాయి అని చెప్పాలి. దీంతో ఇక సీఎస్కే జెర్సీ పై ఉన్న రంగులకు అసలు అర్థాలు ఏంటి అని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇలా జెర్సీపై ఉన్న రంగులకు ప్రత్యేకమైన అర్థాలు కూడా ఉన్నాయట.

 ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం విడుదల చేసిన కొత్త జెర్సీ లో ఆర్మీ రంగును భుజాలపై ఉంచారు. దీని ద్వారా దేశ బరువును భుజాన మోస్తున్న సైన్యాన్ని గౌరవిస్తున్నట్లు సూచిస్తున్నారట. ఇక తమ లెగసిని తెలిపే విధంగా గుండెపై ఐదు స్టార్స్ ఉంచారు. అంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన 5 టైటిల్స్ కి ఇది చిహ్నంగా ఉంటుంది. సింగమ్ లు చురుగ్గా చెమట పట్టకుండా ఉండేందుకు ఇక అరుదైన ఫ్యాబ్రిక్ తో ఈ జెర్సీలను తయారు చేశారు అనేది తెలుస్తోంది. అయితే ఇలా కొత్త జెర్సీతో బలిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్తగా రాణించి మరోసారి టైటిల్ విజేతగా నిలవాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: