తల్లి చెప్పిన ఒక్క మాట.. అశ్విన్ కెరియర్ ను మార్చేసిందట తెలుసా?

praveen
టీమిండియా జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన ఆట తీరుతో ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక దాదాపు దశాబ్ద కాలం నుంచి టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే 2018 - 19 సమయంలో అతను జట్టులో చోటు కోల్పోయాడు. చాలా కాలం పాటు సెలెక్టర్లు అతన్ని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ కెరియర్ కాలం ముగిసిపోయింది ఇక వీడ్కోలు ప్రకటిస్తాడు అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో పట్టు విడువని విక్రమార్కుడిలా అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో ఏకంగా 500 వికెట్ల మైలు రాయిని కూడా అందుకున్నాడు అశ్విన్. తన స్పిన్ బౌలింగ్ తో ప్రతి మ్యాచ్ లోను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఒకవైపు పరుగులు కట్టడి చేయడమే కాదు ఇంకోవైపు వికెట్లను కూడా పడగొడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ అటు స్పిన్ బౌలర్ కావడం వెనక ఏకంగా తన తల్లి చెప్పిన ఒక మాట కారణమని ఏకంగా అశ్విన్ తండ్రి రవిచంద్రన్ ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు.

 టెస్ట్ ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని అందుకోవడం పై స్పందించారు అశ్విన్ తండ్రి రవిచంద్రన్. అశ్విన్ స్కూల్ డేస్ లో అతని తల్లి చిత్రాకి కర్ణాటక సంగీతం పై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే అశ్విన్ ఇక సింగర్ను చేయాలని భావించి సంగీతం క్లాస్ లకు పంపించేది. కానీ అతను మాత్రం సింగింగ్ క్లాస్ లోనే ఎగొట్టి.. క్రికెట్ నేర్చుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచే గురక సమస్య మోకాలి నొప్పి ఉండేది. దీంతో ఫేస్ బౌలింగ్ నుండి ఆఫ్ స్పిన్ వైపు మారాలి అని అశ్విన్ కి అతని  తల్లి సూచించింది. ఇక తల్లి చెప్పిన మాటను విన్న అతను స్పిన్ బౌలింగ్లో తన ఆటను ఎరుగుపరుచుకున్నాడు. ఇక ఇప్పుడు వరల్డ్ నెంబర్వన్ బౌలర్గా అవతరించాడు అంటూ అశ్విన్ తండ్రి రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: