ఏంటి.. ముంబై ఇండియన్స్ జట్టు.. రెండు గ్రూపులుగా విడిపోయిందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఇక చాంపియన్ టీమ్ గా కొనసాగుతున్న జట్టు ఏది అంటే అందరూ కూడా ముంబై ఇండియన్స్ పేరు చెప్పేస్తుంటారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే ముంబై ఇండియన్స్ జట్టు ఛాంపియన్ టీం గా అవతరించింది. ఏకంగా ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచి తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగించింది. ఇదంతా జరగడానికి కారణం కేవలం రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రమే అని చెప్పాలి. అంతకుముందు ఎంతోమంది దిగ్గజాలు అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టిన టైటిల్ మాత్రం అందించలేకపోయారు.

 కానీ రోహిత్ శర్మ సారధిగా ఎంపికైన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టును టైటిల్ విజేతగా వెళ్లిపోయారు. అలాంటి రోహిత్ శర్మను ఏకంగా జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుని మరి అతని చేతిలో కెప్టెన్సీ పెట్టింది. ఇలా రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పించడం మాత్రం అభిమానులకు ఎక్కడ నచ్చలేదు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నాయకత్వ మార్పుతో ఇక జట్టు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా ఒక టీంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్ళు మరో గ్రూపుగా విడిపోయారట. అయితే దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్ రాంజీ మ్యాచ్ లో ఆడకుండా హార్దిక్ పాండ్యా తో కలిసి అటు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పాలి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉంటుందో అనే దానిపై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: