ధోని అభిమానులకు.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ఇర్ఫాన్ పఠాన్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయంలో గత కొంతకాలం నుంచి అభిమానులందరిలో కూడా ఒక కన్ఫ్యూషన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని ఎప్పటి వరకు ఐపీఎల్ లో తన కెరీర్ ని కొనసాగిస్తాడు అనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికాడు ధోని. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకున్నాడు. కానీ అటు ఐపీఎల్ లో క్రికెట్ మాత్రం ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఇక ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక గత ఏడాది ఏకంగా చెన్నై జట్టును ఛాంపియన్గా కూడా నిలిపాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రతి ఏటా టోర్నీ ముగిశాక టోర్నీ ప్రారంభానికి ముందు కూడా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ ఒక ప్రచారం జరుగుతూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో ఇక ధోని ఏమైనా రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నాడా ఏంటి అనే విషయంపై అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇక ఇలాంటి రిటైర్మెంట్ వార్తలను పటా పంచలు చేస్తూ మహేంద్రసింగ్ ధోని మాత్రం వరుసగా ఐపీఎల్ సీజన్స్ ఆడుతూనే వస్తున్నాడు. ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి అంత సిద్ధమవుతుండగా ధోని రిటైర్మెంట్ కి సంబంధించిన వార్తలు మళ్లీ తెరమీదకి వచ్చేసాయి.

 దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇదే లాస్ట్ సీజనా లేకపోతే మరికొన్ని సీజన్లు ఆడతారా అనే ప్రశ్న మాత్రం అటు చెన్నై ఫ్యాన్స్ ని వేధిస్తూనే ఉంది. కాగా ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ధోని అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇటీవల ధోనీని కలిసాను. పొడవాటి జుట్టుతో కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అభిమానుల కోసం మరిన్ని సీజన్లు ఆడేలాగే కనిపిస్తున్నాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ గుడ్ న్యూస్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: