మరోసారి ఇలా ఫుల్లుగా తాగను.. మ్యాక్స్ వెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
సాదరణంగా క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని ప్రదర్శనను ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ కూడా ఇలాగే వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. ఇటీవల మెరుపు సెంచరీ చేసి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఒకవైపు కాలి గాయం వేధిస్తున్న.. అతను మాత్రం డబుల్ సెంచరీతో చెలరేగిపోయి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేసాడు.

 అయితే ఇలా క్రికెట్ తో మాత్రమే కాదు అటు పర్సనల్ విషయాలతో కూడా వార్తల్లో కాస్త హాట్ టాపిక్ గానే మారిపోతున్నాడు ఈ క్రికెటర్. ఏకంగా కొన్ని రోజుల క్రిందట ఫుల్లుగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రి పాలు అయ్యాడు మాక్స్వెల్. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి కోలుకొని ఇటీవల  సెంచరీ తో చెలరేగిపోయాడు ఈ విధ్వంసకర ఆల్రౌండర్. ఇకపోతే గతంలో ఇలా తప్ప తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనపై.. ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్.

 ఈ ఘటనతో నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో బాధపడ్డారు. ఆ వారం ఆటకు దూరంగా ఉంటానని తెలుసు. సమయానికి జట్టుతో కలిసాను. ఇక ఇలా మద్యం సేవించడం విషయంలో మున్ముందు మరింత జాగ్రత్తగా ఉంటాను అంటూ మాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయపడ్డారు. మద్దతుగా నిలిచారు అంటూ తెలిపాడు. అయితే ఇలా ఫుల్లుగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మాక్స్ వెల్ ఫై విమర్శలు రాగా.. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ఇక అందరూ అతనిపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: