టీమిండియాలో ఆ బౌలర్ కి.. నేను పెద్ద అభిమానిని : అశ్విన్

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్  అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్న నేపద్యంలో.. సీనియర్ ప్లేయర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తన టాలెంట్ ని ఎప్పటికప్పుడు సరికొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయితే కొత్త ప్లేయర్లలో ఉన్న కొత్త టాలెంట్ కంటే అశ్విన్ కు ఉన్న అనుభవమే భారత జట్టుకు బాగా ఉపయోగపడుతుంది అనుకునేలా తన ఆట తీరుతో సెలెక్టర్లను సైతం ఫిదా చేస్తున్నాడు ఈ సీనియర్ ప్లేయర్.

 ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్ ను మించిన మరో స్పిన్నర్ లేడు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్లో కూడా నిరూపిస్తూనే ఉన్నాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ కేవలం ఆటలో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక ఎవరైనా ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు అంటే చాలు అతనిపై ప్రశంసలు కురిపించడం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఇంగ్లాండు, టీం ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనీకిస్తూ అదరగొట్టేస్తూ ఉన్న బుమ్రాఫై ప్రశంసలు కురిపించాడు. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఏకంగా 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా కూడా కొనసాగుతూ ఉన్నాడు.

 అంతేకాకుండా ఇటీవల టెస్ట్ ర్యాంకింగ్స్ ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్న స్టార్ బుమ్రాను ప్రశంసించాడు రవిచంద్రన్ అశ్విన్. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సిరీస్లో అందరికంటే ఎక్కువగా 14 వికెట్లు తీశాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. నేను అతనికి పెద్ద అభిమానిని అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు.  గిల్ లో టాలెంట్ బాగుంటుందని.. రెండో టెస్టులు అతను అద్భుతమైన సెంచరీ చేశాడు అంటూ గిల్ పై కూడా ప్రశంసలు కురిపించాడు అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: