టీమిండియాలో.. వారి కథ ముగిసినట్లేనా?

praveen
ఒకప్పుడు భారత జట్టు తరుపున ఆడుతూ ఎంతో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న కొంతమంది సీనియర్ ప్లేయర్ల కెరియర్ ఇక ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. భారత జట్టులోకి ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఇక సీనియర్ ప్లేయర్ల విషయంలో కాస్తయినా కనికరం చూపించడం లేదు సెలెక్టర్లు.  ఇలా గత కొంతకాల నుంచి ఏకంగా భారత జట్టులో చోటు కోల్పోయిన వారిలో ఇక పరిమిత ఓవర్లో ఫార్మాట్లో ఒకప్పుడు అదరగొట్టిన శిఖర్ ధావన్ తో పాటు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరు సంపాదించుకున్న  పూజార, రహనేలు కూడా ఉన్నారు అని చెప్పాలి .

 గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దావన్ అతని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో అతని కెరియర్ ముగిసింది అన్న విషయం ఇక అభిమానులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు పూజారా, రహేనే కెరియర్ కూడా ముగిసిపోయినట్లు తెలుస్తోంది. అయితే పూజార ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతూ డబుల్ సెంచరీలు, సెంచరీలు అంటూ చెలరేగిపోతున్నాడు. దీంతో అతనికి ఇంగ్లాండుతో మిగిలి ఉన్న మూడు టెస్టుల్లో అయినా ఛాన్స్ దక్కుతుందని ఊహించారు అందరు. కానీ ఇటీవలే మూడు టెస్ట్ మ్యాచ్లకు సంబంధించిన జట్టును ప్రకటించగా పూజారను మరోసారి సెలెక్టర్లు పట్టించుకోలేదు.

 దీంతో ఇక ఇటీవల ప్రకటించిన టెస్టు జట్టులో సీనియర్ ప్లేయర్లు పూజార, రహనేలకు చోటు తగ్గకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి వీరిద్దరని పూర్తిగా పక్కన పెట్టేయడం పలు ప్రశ్నలకు కూడా తావిస్తుంది. దీంతో వీరి కెరియర్ ముగిసినట్లే అని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకే బీసీసీఐ కలెక్టర్లు వీరిని పక్కన పెట్టారు అని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే రంజి ట్రోఫీలో సూపర్ ఫామ్ లో ఉన్న సీనియర్ ప్లేయర్ పూజారని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: