మూడో టెస్ట్ కి ముందు.. ఇంగ్లాండ్ జట్టుకి బిగ్ షాక్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండు, టీం ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో ఇక రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగుతోంది అని చెప్పాలి. కాగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగాయ్. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడూ మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సిద్ధమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన మూడో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అటు భారత జట్టును మాత్రమే కాదు ఇంగ్లాండ్ జట్టును కూడా గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న రవీంద్ర జడేజా, కే.ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు గాయం బారినపడి జట్టుకు దూరమయ్యారు. దీంతో  టీమిండియా వ్యూహాలు మొత్తం తారుమారు అయిపోయాయి. అయితే ఇక ఇప్పుడూ మూడో టెస్ట్ మ్యాచ్ కు ముందు అటు ఇంగ్లాండ్ జట్టుకి కూడా ఇలాంటి ఒక బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న స్పిన్నర్ జాక్లీచ్ ఇక  మూడో టెస్ట్ మ్యాచ్  మాత్రమే కాదు టెస్ట్ సిరీస్ మొత్తానికి కూడా దూరం కాబోతున్నాడట.

 అయితే మొదటి టెస్టులో ఆడిన జాక్లీచ్ తన స్పిన్ బౌలింగ్ తో పరవాలేదు అనిపించాడు. అయితే గాయంతో మాత్రం ఇక రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరం అయ్యాడు ఈ స్టార్ ప్లేయర్. మూడో టెస్ట్ మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరికి మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడం లేదట. హైదరాబాదులో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా జాక్ లీచ్ మోకాలికి గాయం అయింది. ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అతనికి కాస్త ఎక్కువ సమయం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. అతను దూరం అవ్వడం మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: