వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమవ్వడంపై.. జైషా కీలక వ్యాఖ్యలు?

praveen
టీమిండియాలో  స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా భారత జట్టు విజయంలో ఎప్పుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించిన విరాట్ కోహ్లీ.. ఇక ఇప్పుడు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుని చెట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే అందరూ ఆటగాళ్లలాగా విరాట్ కోహ్లీ గాయం బారిన పడటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ జట్టుకు దూరంగా ఉన్నాడు అంటే కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే ఇలా జట్టుకు దూరం అవడం జరుగుతూ ఉంటుంది.

 ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు టెస్టు సిరీస్ లు ముగించుకుంది టీమిండియా. మరో మూడు టెస్టులు సిద్ధమవుతుంది అని చెప్పాలి. అయితే ఈ కీలకమైన టెస్ట్ లకు విరాట్ కోహ్లీ మాత్రం అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇక వ్యక్తిగత కారణాలతో అతను బిసిసిఐ సెలెక్టర్ల అనుమతితో లీవ్ తీసుకున్నాడు. అయితే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ల తర్వాత మళ్ళీ అతను జట్టుకు అందుబాటులోకి వస్తాడు అనుకున్నప్పటికీ.. ఇక మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరంగానే ఉంటాడు అన్నది తెలుస్తుంది. అయితే ఎందుకు కోహ్లీ లీవ్ తీసుకున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరం కావడంపై బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నాము అంటూ జైషా చెప్పుకొచ్చాడు. అతడికి ఎప్పుడు మద్దతుగా ఉంటాం అంటూ తెలిపాడు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్లో తనకు సెలవు కల్పించాలని కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలిపాడు. అయితే కోహ్లీ విజ్ఞప్తిని అటు బీసీసీఐ వెంటనే అంగీకరించిందట. అయితే కోహ్లీ ఎలాంటి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: