ఆస్ట్రేలియాతో ఫైనల్ టీమిండియాకు వణుకేనా.. గణాంకాలు చూస్తే నిజమే అనిపిస్తుంది?

praveen
ఈ మధ్యకాలంలో టీమిండియా జట్టు అటు అభిమానులు అందరిని కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియా జట్టు.. ఇక లీగ్ దశలో అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. ప్రత్యర్థి టీమ్స్ అన్నింటిని కూడా చిత్తుగా ఓడిస్తూ ఇక దూసుకుపోతుంది. ఫైనల్ వరకు చేరుకుంటుంది. కానీ ఫైనల్లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం టీమిండియా మాత్రం తడబాటుకు గురవుతుంది అన్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి సీనియర్ టీం నుంచి జూనియర్ టీం వరకు ఇదే తీరు కొనసాగుతూ వస్తుంది.

 మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఉంది అంటే చాలు ఎందుకో భారత ఆటగాళ్లు అందరూ కూడా భయపడిపోతున్నారేమో అన్న విధంగా టీమిండియా ప్రదర్శన సాగుతోంది. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో తలబడ్డాయి ఆస్ట్రేలియా, భారత్ జట్లు. ఇక టీమిండియా గెలిచి విశ్వవిజేతగా అవతరిస్తుంది అనుకుంటే.. ఫైనల్ లో తడబాటుకు గురై చివరికి ఓటమి చూసింది. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు దూసుకుపోయింది టీమిండియా.

 టీమిండియా జోరు చూస్తే అటు భారత జట్టు ఎంతో అలవోకగా వరల్డ్ కప్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలబడి మరోసారి తడబడింది భారత జట్టు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్న కల కలగానే మిగిలిపోయింది. అయితే ఇక ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో ఇదే జరిగింది. వరుసగా 6 విజయాలు సాధించి ఫైనల్ అడుగుపెట్టిన యంగ్ టీమ్ ఇండియా ఇక ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మరోసారి భారత జట్టును చిత్తుగా ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. అయితే ఆస్ట్రేలియాను చూస్తే భారత్కు వణుకు పుడుతుంది అనేది కొన్ని గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్, 2005 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్, 2020 ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసి ఫైనల్, 2023 వరల్డ్ కప్ ఫైనల్, 2024 అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తో తలబడి ఓడింది టీం ఇండియా. ఇలా టీమిండియాను ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫోబియా వేధిస్తుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: