అండర్ 19 ఫైనల్లో ఓటమి.. మనోడే మనల్ని దెబ్బ కొట్టాడు?

praveen
వరల్డ్ క్రికెట్ లో ఉన్న పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతోంది టీమ్ ఇండియా. ఇక వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి కూడా బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక అటు భారత జట్టుకు మాత్రం వరల్డ్ కప్ ఎక్కడ కలిసి రావడం లేదు. లీగ్ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న టీమిండియా.. ఇక ఫైనల్ వరకు దూసుకుపోతుంది. కానీ ఫైనల్ లో మాత్రం అందరిని నిరాశ పరుస్తూ వస్తుంది. దీంతో ప్రేక్షకులందరికీ కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అనే కల చివరికి కలగానే మిగిలిపోతుంది.

 ఈ క్రమంలోనే టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా చేతిలోనే భారత సీనియర్ టీం రెండుసార్లు ఓడిపోయింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు జూనియర్ టీం అయినా సీనియర్ల ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని అనుకున్నారు అందరూ. అండర్ 19 ప్రపంచకప్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోయిన యంగ్ టీమ్ ఇండియా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఇక మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఫైనల్ వరకు వెళ్ళింది. ఐసీసీ ట్రోఫీ ఫైనల్ లో ఈ రెండు టీంస్ మధ్య మ్యాచ్ జరిగింది.

 తప్పకుండా గెలుస్తుంది అనుకున్న టీమిండియా మాత్రం చివరికి మరోసారి నిరాశ పరిచింది. ఇటీవల జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నిలో ఎలా అయితే ఫైనల్ లో భారత బ్యాటింగ్ విభాగం విఫలమయిందో.. ఇక ఇటీవల జరిగిన అండర్ 19 ఫైనల్లో కూడా అదే జరుగుతుంది. అయితే ఇక వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టును దెబ్బ కొట్టింది భారతీయుడే అన్నది తెలుస్తుంది. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా బ్యాటర్ హార్జాస్ సింగ్ ఆదరగోట్టాడు. అతని తండ్రి ఇంద్రజిత్ సింగ్ పంజాబ్ బాక్సింగ్ ఛాంపియన్, తల్లి లాంగ్ జంప్ అథ్లెట్. 2000 సంవత్సరంలో వీరు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. ఇక అక్కడే స్థిరపడ్డారు. 2005లో సిడ్నిలో జన్మించాడు హార్జాస్ ఇక ఈ వరల్డ్ కప్ లో అతడు పెద్దగా రాణించకపోయిన.. ఫైనల్ లో మాత్రం 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీ తో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: