రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్ లోనే పృథ్వి షా సెంచరీ?

praveen
ఇటీవల కాలంలో దేశవాలి క్రికెట్లో సత్తా చాటుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమ్ ఇండియా జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే  ఇక ఇలా వచ్చిన వారు తమ సత్తా ఏంటో నిరూపించుకొని జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం నిలకడలేమితో చివరికి జట్టులో తమ స్థానాన్ని కోల్పోతూ ఉన్నారు. అచ్చం ఇలాగే దేశవాళి క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుని భారత జట్టులోకి వచ్చాడు. ఇక భారత టీమ్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే క్రికెట్ దేవుడు సచిన్ వారసుడు అని గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ సముద్రపు అలల ఎంత వేగంగా అయితే జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అతను ఎవరో కాదు పృథ్వి షా.

అయితే అతను భారత జట్టు తరపున మ్యాచ్ ఆడి దాదాపు ఏడాదికి పైగా కాలం గడిచిపోతుంది. అయితే ఐపీఎల్లో కాస్తో కూస్తో రాణిస్తున్న సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే నిలగడలేమిటో ఇబ్బంది పడుతున్న పృథ్వి షా.. ఇటీవల కాలంలో ఫిట్నెస్ గురించి మరిచిపోయి భారీగా బరువు కూడా పెరిగిపోవడం చూశాము. అయితే అనవసరమైన వివాదాల్లో కూడా చిక్కుకుంటూ అటు కెరియర్ ను మరింత ప్రమాదంలో పడేసుకుంటూ ఉన్నాడు పృథ్వి షా. అయితే మొన్నటి వరకు రంజీ మ్యాచ్ లు కూడా ఆడలేదు. ఇక ఇప్పుడు ఏకంగా మళ్లీ రంజీ ట్రోఫీలో రీ ఎంట్రీ  ఇచ్చాడు.

 అయితే అతని ప్రదర్శన ఎలా ఉంటుందో అనే విషయంపైనే అందరూ చర్చలు జరిపారు అని చెప్పాలి. అయితే ఇక రీఎంట్రీలో మాత్రం అదరగొడుతున్నాడు ఈ యువ ఆటగాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవల చత్తీస్గఢ్ తో జరుగుతున్న మ్యాచ్లో.  ముంబై ఓపెనర్ గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 185 బంతుల్లోనే 18 ఫోర్లు మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. ఇక మరో ఓపనర్  లాల్బాని తో కలిసి ఏకంగా తొలి వికెట్ కు 240 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పాలి. అయితే అతను రంజీ ట్రోఫీలో ఇలాగే రానిస్తే రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలోకి వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sha

సంబంధిత వార్తలు: