ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. తగ్గేదేలే అంటున్న ఇంగ్లాండ్ క్రికెటర్?

praveen
ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్లు ముగిసాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం అటు టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ కి ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు అందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే మూడో టెస్ట్ కు కాస్త సమయం ఉండడంతో ఇంగ్లాండు ప్లేయర్లందరూ కూడా అబూదాభి చేరుకున్నారు. అక్కడ అందరూ ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటూ వెకేషన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి  కానీ ఇంగ్లాండ్ జట్టులోని ఒక ప్లేయర్ మాత్రం అందరూ రెస్ట్ తీసుకుంటుంటే.. అతను మాత్రం అక్కడ వరుసగా క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉండడం గమనార్హం. అతను ఎవరో కాదు ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న డాన్ లారెన్స్. మూడో టెస్ట్ మ్యాచ్ కోసం వచ్చిన గ్యాప్ ని అతను సద్వినియోగం చేసుకునే పనిలోపడ్డాడు  ఈ క్రమంలోనే ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో ఆడుతున్నాడు.

 ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ డాన్ లారెన్స్ డిజర్ట్ వైపర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా.. అతను డిజర్ట్ వైపర్స్ తరఫున రెండు మ్యాచ్లు ఆడబోతున్నాడు  ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత మళ్లీ ఇక మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసి ఇండియాకు చేరుకోబోతున్నాడు అని చెప్పాలి. దీంతో ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అందరూ విశ్రాంతి కోసం ఎదురు చూస్తుంటే ఇతను మాత్రం దొరికిన విశ్రాంతిని కూడా వరుసగా ఆడేస్తున్నాడు   ఆడ ఉంటా ఈడ ఉంటా అనే రేంజ్ లో తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: