అతని కోసం రూ.14 కోట్లు పెట్టిన CSK.. షాక్ తప్పదా?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా అటు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ గురించి కాదు.. అంతకుముందే ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచిబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు బీసీసీఐ కూడా ఐపీఎల్ కోసం అన్ని రకాల సన్నాహాలను చేసేస్తుంది   కాగా డిసెంబర్ నెలలో అటు 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేలంలో అన్ని టీమ్స్ కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాయ్. తమ జట్టుకు ఉపయోగపడతాడు అనే ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

 ఈ క్రమంలోనే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ ధోని టీం గా పేరు సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే అతను జట్టులోకి వస్తే ఇక జట్టు కూర్పు ఎంతో బలంగా ఉంటుందని భావించిన ధోని అతని కోసం ఏకంగా 14 కోట్లు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇలా భారీ ధర పెట్టి జట్టులోకి తీసుకుంది. అయితే అతని విషయంలో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ తగిలేలాగే కనిపిస్తూ ఉంది.

 ఎందుకంటే గత ఏడాది జరిగిన వేలంలో ఏకంగా 14 కోట్లు పెట్టి డారిల్ మిచెల్ ను చెన్నై జట్టు కొనుగోలు చేయగా.. ఇక ఇప్పుడు ఐపీఎల్ కు ముందు అతను గాయం బారిన పడటం ఆందోళనకరంగా మారింది. దక్షిణాఫ్రికా తో రెండో టెస్ట్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని కాలి బొటన వెలికి గాయమైంది. అయితే అది తీవ్రతరం కావడంతో మిచెల్ కు ప్రస్తుతం రెస్ట్ ఇచ్చినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక అతని స్థానంలో ఆల్రౌండర్ విల్ ఓరూర్క్ ను జట్టులోకి తీసుకున్నారు  అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అని తెలియడంతో అతను ఐపీఎల్ నాటికి కోలుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk

సంబంధిత వార్తలు: