జడేజాను క్రికెటర్ చేసీ తప్పు చేశా.. తండ్రి సంచలన కామెంట్స్?

praveen
సాదరణంగా మన దేశంలో క్రికెటర్లకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  క్రికెటర్లను ఏకంగా దేవుళ్ళు లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం తెరమీదకి వచ్చిందంటే చాలు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయం కాకుండా పర్సనల్ విషయం ఏదైనా ఇంటర్నెట్ లోకి వస్తే ఆ విషయం గురించి అందరూ చర్చించుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా గురించి ఇలాంటి ఒక పర్సనల్ విషయమే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. జడేజా ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. బ్యాటింగ్లో ఆకట్టుకోవడమే కాదు తన స్పిన్ బౌలింగ్ తో కూడా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. ఇక ఫీల్డింగ్  లో చిరుత పులిలా కదులుతూ ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా.  ప్రతి ఫార్మాట్లో కూడా అతను టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్ గానే కొనసాగుతూ ఉంటాడు. కాగా రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఈ ఇద్దరిపై రవీంద్ర జడేజా  తండ్రి అనిరుద్ సంచలన ఆరోపణలు చేయగా.. ఇక అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పెళ్లి తర్వాత రవీంద్ర జడేజాలో చాలా మార్పులు వచ్చాయి. ఇక మా మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి అంటూ జడేజా తండ్రి చెప్పుకొచ్చారు. అయితే కుటుంబంలో చీలిక రావడానికి జడేజా భార్య రివాబానే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది. రివాభాను పెళ్లి చేసుకునేవాడు కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయ్. అయితే తండ్రి వ్యాఖ్యలపై స్పందించిన జడేజా ఆయన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: