అటు సీనియర్లు.. ఇటు జూనియర్లు.. ఓడిపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారా?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో ఉన్న పటిష్టమైన టీమ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు ఐసిసి ఈవెంట్ జరిగిన కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది పాకిస్తాన్. కానీ ఎందుకో గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే కాదు అటు ద్వైపాక్షిక సిరీస్లలో కూడా చెత్త ప్రదర్శన చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.

 కాగా పాకిస్తాన్ జట్టుకు గత ఏడాది చివరికి నిరాశ మిగిలింది. ఎందుకంటే 2023 సంవత్సరంలో అటు ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఏకంగా చిరకాల ప్రత్యర్థిగా కొనసాగుతున్న భారత గడ్డపై వరల్డ్ కప్ టైటిల్ గెలిచి చిరస్మరణీయమైన  విజయాన్ని సాధించాలని అనుకుంది. కానీ ఊహించని రీతిలో కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది పాకిస్తాన్ జట్టు. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.

 అయితే 2023 ఏడాది పాకిస్తాన్ కు నిరాశ మిగల్చగా.. ఇక 2024 ఏడాదిలో కూడా పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. సొంత గడ్డపైనే కాదు విదేశీ గడ్డపై కూడా పాకిస్తాన్ జట్టు ఆడిన ద్వైపక్షక సిరీస్లలో కూడా వరుస పరాజయాలు సాధిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది పాకిస్తాన్ టీం. అయితే కేవలం పాకిస్తాన్ సీనియర్ జట్టు మాత్రమే కాదు కుర్రాళ్ల జట్టు కూడా అదే రీతిలో వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతుంది అన్నది తెలుస్తోంది.  ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ కుర్రాళ్ల ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఆరు మ్యాచ్లలో ఆరింటిలో కూడా విజయం సాధించి.. ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. అయితే భారత దాయాది దేశమైన పాకిస్తాన్ మాత్రం మరోసారి ఆ జట్టు అభిమానులు అందరినీ కూడా నిరాశలో ముంచేసింది అని చెప్పాలి. సెమీఫైనల్ వరకు బాగానే ప్రస్తానాన్ని కొనసాగించిన పాకిస్తాన్ జట్టు సెమి ఫైనల్ నుంచి మాత్రం చివరికి నిష్క్రమించింది. ఇటీవల చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఏకంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పై విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో అండర్ 19 వరల్డ్ కప్ గెలవాలనే కల పాకిస్తాన్ కు కలగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: