ఒదిగి ఉండడం నేనుండే నేర్చుకోవాలి ధోని భాయ్.. కోట్ల రూ.లు కూడా లెక్క చేయలేదు?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  సాధారణంగా ఎవరైనా క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత.. అతనితో ప్రమోషన్స్ చేపించుకోవడానికి పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించవు. కేవలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతూ మంచి ఫామ్ లో ఉన్న ఆటగాడితో ప్రమోషన్స్ చేయించుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ధోని విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది  అతను 2019లో కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఎన్నో కంపెనీలు ధోనితో ప్రమోషన్స్ చేయించుకోవడానికి క్యూ కడుతూ ఉంటాయి.

 ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనినే ఎక్కువ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇక ధోని వాడే బ్యాట్ దగ్గర నుంచి వేసుకునే గ్లౌజ్ వరకు కూడా అన్ని వాణిజ్య ప్రకటనల్లో భాగమే. అయితే ధోని వాడే బ్యాడ్ కి ఇక ఎన్నో కంపెనీల స్టిక్కర్స్ ఉంటాయి. అలా స్టిక్కర్ వేసుకోవడం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ధోనీకి వస్తూ ఉంటుంది. కానీ ఇటీవల స్నేహితుడి కోసం ఏకంగా ఇలా కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా లెక్క చేయలేదు.

 ఏకంగా తన చిన్ననాటి స్నేహితుని షాప్ లోగో ఉన్న బ్యాట్ తో ధోని క్రికెట్ ఆడాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చిన్న షాప్ నడుపుకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన స్నేహితునికి.. తన వంతు సహాయం చేయాలనుకున్నాడు ధోని. ధోని చిన్ననాటి స్నేహితుడు రాంచీలో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని షాప్ పేరు ఉన్న స్టిక్కర్ ను తన బ్యాట్ కు వేసుకొని.. ఐపిఎల్ కోసం ప్రాక్టీస్ చేశాడు ధోని. దీంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు తలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: