షమి ప్రతిభకు అవార్డుల దాసోహం.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు?

praveen
ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ క్రికెటర్లుగా కొనసాగుతుంది ఎవరు అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరును మాత్రమే అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఈ ఇద్దరితోపాటు అటు మహమ్మద్ షమీ కూడా దాదాపు దశాబ్ద కాలం నుంచి టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తూ  వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతోమంది ప్లేయర్లు అటు యువ ఆటగాళ్ల రాకతో జట్టులో చోటు కోల్పోయినప్పటికీ.. మహమ్మద్ షమీ మాత్రం తన ప్రతిభను ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకుంటూ సత్తా చాటుతూనే ఉన్నాడు.ఇక భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే గత ఏడాది ఇండియా వేదిక జరిగిన వరల్డ్కప్ టోర్నీలో షమీ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ మ్యాచులలోనే టాప్ వికెట్ టేకర్ గా కూడా రికార్డు సృస్టించాడు. అయితే గత కొంతకాలం నుంచి చీలమండ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలోనే రెండవ అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుని ఇటీవలే అటు మహమ్మద్ షమీ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి..

 అయితే ఇక ఇప్పుడు టీమిండియా స్టార్ ఫేసర్ అని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ అవార్డ్స్ అందించే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు మహమ్మద్ షమి. ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. గత ఏడాది చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఇక ఈ ఆవార్డును షమీకి బహుకరించారు. కాగా వరల్డ్ కప్ లో ఏడు మ్యాచ్లలో 24 వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ షమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: