ముంబై ఇండియన్స్.. రోహిత్, హార్దిక్ మధ్య గొడవలు పెట్టిందా?

praveen
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఇక జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా హవా నడిపిస్తున్న హార్దిక్ పాండ్యా మధ్య అంతర్గత వివాదాలు నడుస్తున్నాయా అంటే గత కొంతకాలం నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తూ ఉంది. అయితే దీనికంటకీ కారణం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అన్నది తెలుస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టుకి ఐదు సార్లు టైటిల్ అందించిన సారథిగా కూడా ఇప్పటికే రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ లో ఉన్న మిగతా టీమ్స్ అన్నీ కూడా తమకు రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ దొరికితే  బాగుండు అని కోరుకుంటున్నాయ్. ఇలాంటి సమయంలో ఏకంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్యాకు కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది అని చెప్పాలి.దీంతో హార్దిక్, రోహిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు రోహిత్, హార్దిక్ పాండ్యా మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 ఏకంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాలు ఒకరిని ఒకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకున్నారట. రోహిత్ ఖాతాను హార్దిక్ పాండ్యా అన్ ఫాలో చేసినట్లు సమాచారం. కానీ నేటిజెన్లు మాత్రం దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అసలు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో కావడం లేదు అంటూ కొంతమంది చెబుతూ ఉంటే.. వీరిద్దరూ కొన్నేళ్లుగా ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారని కానీ రీసెంట్ గానే ఇద్దరు అన్ ఫాలో చేసుకున్నారు అంటూ ఇంకొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: