విదేశాంగ మంత్రి జైశంకర్ కి.. ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

praveen
టీమిండియా లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ధోని కెప్టెన్ గా ఉన్న సమయం లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయం లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతను ఎప్పటికీ నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటికే ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను అతని బద్దలు కొట్టేసాడు.

 ఇక రాబోయే తరాలలో యువ ఆటగాళ్లు బద్దలు కొట్టడానికి కొన్ని రికార్డులు ఉండేలా తన పేరిట ఎన్నో రికార్డులను రాసేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక నేటితరం యువ క్రికెటర్లు అందరికీ కూడా అతను ఒక పూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీకి కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కేవలం క్రీడాభిమానులు మాత్రమే కాదు సినీ రాజకీయ రంగాల్లో కొనసాగుతున్న వారు సైతం ఇక కోహ్లీని అమితంగా అభిమానిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా కోహ్లీకి వీరాభిమానులుగా ఉన్న వారిలో అటు ప్రస్తుతం ఇండియాలో విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్న జైశంకర్ కూడా ఉన్నారట.

 టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి తాను వీరాభిమాని అన్న విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల తెలిపారు. అతడిని ఎక్కువగా అభిమానిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. కోహ్లీలోని పోటీ తత్వం తనకు ఎంతగానో నచ్చుతుంది అంటూ తెలిపాడు. అయితే జై శంకర్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ అధ్యక్షులు, ప్రధానులు బ్యాట్లను బహుకరిస్తూ ఉంటారు. ఇటీవల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్  సైతం జయశంకర్కు బ్యాట్ ని ప్రధానం చేసి క్రికెట్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: