వావ్.. ఈ క్యాచ్ ను కావ్య పాప చూసిందంటే.. ఎగిరి గంతేస్తుంది?

praveen
టి20 ఫార్మాట్లో ఆటగాళ్ల విన్యాసాలకు ఎక్కడ కొదవ ఉండదు అన్న విషయం తెలిసిందే.  ఏకంగా మైదానంలో  చిరుతపులుల్లా కదులుతూ నమ్మశక్యంగానే రీతిలో ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి విన్యాసాలను చూసి ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక కొంతమంది ఆటగాళ్లు మైదానంలో మెరుపు వేగంతో పట్టే క్యాచ్ లు అయితే నమ్మశక్యం కాని విధంగానే ఉంటాయి అని చెప్పాలి. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 లీగ్ లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన విన్యాసం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్  జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న మార్కరమ్ ఒక స్టన్నింగ్ క్యాచ్ ని అందుకున్నాడు. ఇటీవల న్యూ ల్యాండ్స్ వేదికగా సన్రైజర్స్ ఈస్టర్ను కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. డర్బన్ ఇన్నింగ్స్ సమయంలో అద్భుతమైన క్యాచ్ నమోదయింది. ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ను ఓటి నిల్  వేశాడు.

 అయితే డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్ జేజే స్మార్ట్ మిడాన్ దిశగా ఫీల్డర్ పైనుంచి వెళ్లేలా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఫీలింగ్ చేస్తున్న మార్కరమ్ సరైన టైమింగ్ లో గాల్లోకి పక్షిల ఎగిరీ జంపు చేశాడు  విల్లులా శరీరాన్ని వంచుతూ  ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ ని అందుకున్నాడు. దీంతో ఈ క్యాచ్ చూసి బ్యాట్స్మెన్ సైతం షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసి నెటిజెన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఈ క్యాచ్ చూస్తే ఎగిరి గంతులు వేస్తుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. సాధారణంగా సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి డక్ అవుట్ లో కూర్చుని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ స్టన్నింగ్ క్యాచ్ తర్వాత ప్రేక్షకులు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: