కేన్ విలియమ్సన్ కి షాకిచ్చిన రచిన్.. అంత మాట అనేసాడేంటి?

praveen
భారత సంతతి కలిగిన న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తన ఆట తీరుతో సత్తా చాటాడు. ఇక భారత సంతతి ప్లేయర్ కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ కి కూడా అతను బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ కప్ ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టులో తన స్థానాన్ని సూస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు.

 అయితే ఇలా డబల్ సెంచరీ చేసిన రచిన్ రవీంద్ర ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. అయితే ఈ అవార్డు విషయంలో న్యూజిలాండ్ జట్టు సీనియర్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన కేన్ విలియమ్సన్ కి షాక్ ఇచ్చాడు రచిన్ రవీంద్ర. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 281 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది కీవిస్. రచిన్ రవీంద్ర ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. కేన్ విలియమ్సన్ అయితే 118 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఇక నువ్వా నేను అన్నట్లుగా సాగిన ఈ పోరులో 218 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది న్యూజిలాండ్. అయితే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్  విలియంసన్, రచిన్ రవీంద్ర లలో ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు అనేదే విషయంపై సస్పెన్షన్ నెలకొంది.

 అయితే తొలి ఈన్నింగ్స్ లో 240 పరుగులు చేసి ఏకంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయిన  రచిన్ రవీంద్ర కే అవార్డును ఇచ్చారు. అయితే ఈ అవార్డును ఇచ్చే సమయంలో రెండు ఇన్నింగ్స్ లలో కూడా సెంచరీ తో రానించి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన కేన్ విలియమ్సన్ తో ఈ అవార్డును పంచుకుంటావా అంటూ రచిన్ రవీంద్రను ప్రశ్నిస్తే.. అసలు పంచుకోనని రచిన్ సమాధానం చెప్పాడు. కేన్ విలియమ్సన్ కి 31 సెంచరీలు ఉన్నాయని.. తనకు ఇదే తొలి డబుల్ సెంచరీ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కాగా రచిన్ రవీంద్ర చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: