నెంబర్.1 ర్యాంక్.. షాకింగ్ పోస్ట్ పెట్టిన బుమ్రా?

praveen
భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న బుమ్రా  ఇటీవల కాలంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే ఈ క్రమంలోనే  టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. ఈ క్రమంలోనే వరుసగా మ్యాచ్లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్టు జరగగా ఆంధ్రప్రదేశ్లోని.. విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియ  రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

 కాగా విశాఖ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా. ఏకంగా తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచిన పేసర్.. ఇక రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. మొత్తంగా ఒక మ్యాచ్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అనుకున్నాడు. అంతేకాదు ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఏకంగా 881 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

 ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్ లలో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఏకైక బౌలర్గా వరల్డ్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు  ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత స్టార్ బౌలర్ బుమ్రా పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోలో సపోర్ట్ చేసేవారు స్టేడియంలో ఒక్కరే ఉంటే.. ఇక అభినందనలు తెలిపే వారు మాత్రం స్టేడియం నిండా ఉన్నారు. అంటే సపోర్ట్ చేసేవారు కొంతమంది ఉంటే.. ఇక విజయం సాధించాక అభినందించే వారు చాలామంది ఉంటారు అన్న అర్థం వచ్చే విధంగా ఈ పోస్ట్ పెట్టాడు. బుమ్రా ఇలా ఎందుకు పోస్ట్ చేశాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: