చరిత్ర సృష్టించిన బుమ్రా.. వరల్డ్ లోనే ఏకైక బౌలర్?

praveen
భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు బుమ్రా. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ సత్తా చాటిన బుమ్రా ఇక సెలక్టర్ల చూపును ఆకర్షించి టీమిండియాలోకి వచ్చేసాడు. అయితే భారత జాతీయ జట్టులోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన బౌలింగ్ తో మెరుపులు మెరిపించి  తన స్థానాన్ని టీంలో సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ ఉంటాడు బుమ్రా.

 ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బౌలింగ్ మెరుపులతో ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంగ్లాండు టీం ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉండగా.. ఈ టెస్ట్ సిరీస్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్టుల్లో పరవాలేదు అనిపించిన బుమ్రా.. ఇక విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం తన బౌలింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఏకంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు  అంతే కాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

 అయితే ఇలా విశాఖ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సత్తా చాటిన బుమ్రా ఇక ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా అదరగొట్టేసాడు. ఏకంగా ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ర్యాంకింగ్స్ లో 881 పాయింట్లతో ఏకంగా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ గా మారిన మొదటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఆసియా ఆటగాళ్ళలో విరాట్ కోహ్లీ బుమ్రా మాత్రమే అన్ని ఫార్మర్లలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు అని చెప్పాలి. గతంలో వీరిద్దరూ టెస్ట్ ఫార్మాట్ కాకుండా మిగతా ఫార్మాట్ లలో కూడా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: