టెస్ట్ క్రికెట్లో వెనుకబడిపోతున్న కోహ్లీ.. ఇదిగో ఇదే సాక్ష్యం?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్  విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఆట తీరితో వరల్డ్ క్రికెట్లో తనను మించిన లెజెండ్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది లెజెండ్స్ సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి తన పేరిట లికించుకున్నాడు.

 అయితే సెంచరీల విషయంలో కూడా నేటితరం స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక అతని దూకుడు చూస్తూ ఉంటే తప్పకుండా సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అనేలాగే కనిపిస్తూ ఉన్నాడు. అయితే అటు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం గత కొంతకాలం నుంచి కోహ్లీ ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు  దీంతో సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రభా రోజురోజుకు తగ్గిపోతుంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. విశ్లేషకులు ఇలా అనడం వెనక కారణం కూడా లేకపోలేదు.

 గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో బాగా రాణిస్తున్న.. టెస్టుల్లో ఆశించినంతగా కోహ్లీ బ్యాట్ నుంచి ప్రదర్శన రావడం లేదు. ఇక ఇందుకు ఒక పోస్ట్ ఇప్పుడు బలాన్ని చేకూరుస్తుంది. 2021 నాటికి విరాట్ కోహ్లీ 27 టెస్ట్ సెంచరీలు చేశాడు ఇక అప్పటికి ఫ్యాబ్ ఫోర్ గా పిలుచుకునే వాళ్లలో.. కోహ్లీ 27, స్మిత్ 26, రూట్ 17, విలియంసన్ 23 సెంచరీలతో ఉన్నారు. అయితే ఇప్పుడు స్మిత్ 33, కేన్ విలియంసన్ 31, రూట్ 30 సెంచరీలతో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. అటు విరాట్ కోహ్లీ మాత్రం 29 సెంచరీలతో చివరి స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: