రాజ్ కోట్ లో మూడో టెస్ట్.. మైదానం పేరు మార్చబోతున్నారట?

praveen
సాధారణంగా క్రికెట్లో ఎనలేని సేవలు అందించిన ఆటగాళ్లకు కొన్ని కొన్ని సార్లు క్రికెట్ అసోసియేషన్స్ అరుదైన గౌరవం ఇవ్వడం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆయా ఆటగాళ్ల పేర్లను స్టేడియం కు పెట్టడం చేస్తూ ఉంటుంది. లేదంటే కొంతమంది ఆటగాళ్ల పేరును స్టేడియంలోని ఒక గాలరీకి పెట్టడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటివరకు బీసీసీఐ సహా కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు కూడా ఇలా క్రికెట్లో సేవలు అందించిన ఆటగాళ్ళ పేర్లను స్టేడియం కు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ కి వేదికగా మారబోయే రాజ్కోట్ వేదికకు కూడా క్రికెట్ అసోసియేషన్ పేరును మార్చేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తోంది  మాజీ సౌరాష్ట్ర క్రికెటర్ నిరంజన్ షా పేరును రాజ్కోట్ మైదానం కి పెట్టబోతుందట సౌరాష్ట్ర   క్రికెట్ అసోసియేషన్. ఈ విషయంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున నిరంజన్ ఇక ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి. తన ఆటతీరుతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోగా విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఇక ఇప్పుడు రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్కోట్ మైదానం గురించి ఏ విషయం తెరమీద మీకు వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: