గంగూలీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన.. రాహుల్ ద్రావిడ్?

praveen
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్లో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవల రెండు టెస్ట్ మ్యాచ్లను ముగించుకుంది టీమ్ ఇండియా. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియ.. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే భారత బౌలర్లు రెండు టెస్ట్ మ్యాచ్ లోను అదిరిపోయే ప్రవేశం చేశారు.

 ఇలాంటి పరిస్థితుల నేపథ్యం  లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా క్రికెట్ లో లెజెండ్ గా కొనసాగుతున్న మాజీ ఆటగాడు సౌరబ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. విదేశీ జట్లు భారత పర్యటనకు వచ్చిన సమయం లో ఏకంగా భారత జట్టుకు అనుకూలంగా ఉండే విధంగా టర్నింగ్ పిచ్ లను తయారు చేస్తారని.. కానీ అలాంటి అవసరం లేదని.. ఎందుకంటే భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు అంటూ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కాగా గంగూలీ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారిపోయాయి అని చెప్పాలి.

 ఇలా భారత్లో స్పిన్ స్పీచ్ లు ఎందుకు అని సౌరబ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. క్యూరేటర్లకు టర్నింగ్ పిచ్ తయారు చేయమని తామెప్పుడు అడగము అంటూ స్పష్టం చేశాడు రాహుల్ ద్రావిడ్. మన దేశంలో సహజంగానే వికెట్లు స్పిన్ కి బాగా అనుకూలిస్తూ ఉంటాయి. అంతేకానీ పూర్తిగా టర్నింగ్ పిచ్లు కావాలని మేము ఎప్పుడు అడగము. ఎలాంటి పిచ్ పైన అయినా సరే అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా ప్రదన లక్ష్యం అంటూ రాహుల్ ద్రవిడ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: