ఆ ముగ్గురిని చూసి.. యార్కర్ వేయడం నేర్చుకున్నా : బుమ్రా

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమిండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో ఇక ఏ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది అన్నది ఊహించడం కూడా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఘనవిజయం అందుకుని భారత జట్టుకు షాక్ ఇచ్చింది. అయితే విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం భారత్ అద్భుతంగా పుంజుకుంది.

 ఈ క్రమంలోనే రెండో మ్యాచ్లో విజయం సాధించింది  అయితే ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది భారత జట్టు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవడంలో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ తో పాటు బుమ్రా బౌలింగ్ ప్రదర్శన, గిల్ శతకం కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్లో విజయం అనంతరం మంచి ప్రదర్శన చేసి జట్టును గెలిపించిన బుమ్రా, గిల్, యశస్వి  పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. ఈ క్రమంలోనే యార్కర్లు వేయడం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావ్ అంటూ బుమ్రాను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు.

 నేను ఎప్పుడూ గణాంకాల గురించి ఆలోచించను అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఫాలో అవుతున్నాను అంటూ తెలిపాడు. అయితే చిన్నప్పటినుంచి యార్కర్ బంతిని ఎలా సంధించాలి అనేదానిపై ప్రాక్టీస్ చేశాను. క్రికెట్ దిగ్గజాలు వాకార్ యూనిస్, వసీం అక్రమ్, జహీర్ ఖాన్ బౌలింగ్ ను చూస్తూ అలాంటి బంతులను ఎలా వేయాలో నేర్చుకోగలిగాను  ఇప్పుడు భారత క్రికెట్ పరివర్తన దశలో ఉంది. ఈ సమయంలో నా వంతు భాగస్వామ్యం ఉండాలని ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. రోహిత్ శర్మతో కలిసి సుదీర్ఘంగా మ్యాచ్ లు ఆడుతూ ఉన్నాను. ఇక జేమ్స్ అండర్సన్ తో పోటీ అనేది ఉండనే ఉంది అంటూ  బుమ్రా కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: