సన్రైజర్స్ ఓపెనర్ ఊచకోత.. ఏకంగా డబుల్ సెంచరీ?

praveen
గత కొన్ని సీజన్స్ నుంచి కూడా ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎక్కడా కలిసి రావడం లేదు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది కూడా జట్టులో ఉన్న ఆటగాళ్ళలో మార్పులు చేస్తూనే వస్తుంది జట్టు యాజమాన్యం  అయితే ఎన్ని మార్పులు చేసిన ఏకంగా జట్టుకు కొత్త కెప్టెన్ నియమించిన కూడా సన్రైజర్స్ కి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ కోసం మాత్రం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది సన్రైజర్స్. ఈ క్రమంలోనే జట్టుకు ఉపయోగపడతారు అన్న ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది.

 ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఆటగాడు ఎవరైనా ఇతర టోర్నీలలో అద్భుతమైన ప్రదర్శన చేసాడు అంటే చాలు ఇక ఆ ఆటగాడు ఇన్నింగ్స్ గురించి తెలుసుకుంటూ ఎంతో మంది సన్రైజర్స్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాగే యువ ఆటగాడు తన ఆట తీరుతో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ సీ లో పంజాబ్, చండీగఢ్ జట్లు తలబడ్డాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.

 తర్వాత వర్షం తగ్గినప్పటికీ అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు  ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ఆట ముగిసి సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 477 పరుగులు చేసింది. పంజాబ్ వికెట్ కీపర్ అన్మోల్ ప్రీత్ సింగ్ అజేయమైన ద్విశతకంతో చెలరేగాడు. 329 బంతుల్లో 25 ఫోర్ లతో 205 పరుగులు చేశాడు. అతనితోపాటు మరో వికెట్ కీపర్ ప్రభు సిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీ తో విరుచుకుపడ్డాడు. 215 బంతుల్లో 171 పరుగులు చేశాడు. కాగా అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్లో సన్రైజర్స్ కు ప్రాతినిథ్యం  వహిస్తున్నాడు అని చెప్పాలి. దీంతో అతని ఇన్నింగ్స్ చూసి సన్రైజర్స్ ఫ్యాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: