సెంచరీ చేసినా.. అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు : గిల్

praveen
సాధారణంగా అప్పటివరకు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన ఆటగాడు.. ఇక మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అంటే చాలు తన ఇన్నింగ్స్ ని ఇక ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది ఏకంగా సెంచరీ తో చెలరేగి పోతే ఆటగాడి సెలబ్రేషన్స్ కి హద్దులు కూడా ఉండవు. కానీ ఇటీవల సెంచరీ తో చెలరేగి పోయిన శుభమన్ గిల్ మాత్రం ఎందుకో సెలబ్రేషన్స్ కి దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమ్ ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది.

 అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశ పరిచిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ తో చెలరేగిపోయాడు. 104 పరుగులు చేసి అటు జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపడుతున్న వేళ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే అంతకుముందు మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక అలాంటి సమయంలో సెంచరీ చేస్తే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీ కొట్టిన కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే తాను ఇలా సెలబ్రేషన్స్ కి ఎందుకు దూరంగా ఉన్నాను అన్న విషయంపై మ్యాచ్ అనంతరం స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. అప్పటికే వికెట్లు వరుసగా కోల్పోతున్నాం. ఇంకా చాలా పని మిగిలి ఉంది అని నేను అనుకున్నాను. అందుకే సెంచరీ సెలబ్రేషన్స్ నూ పట్టించుకోలేదు అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. ద్రావిడ్, రోహిత్ ల నుంచి లభించిన ప్రోత్సాహం నాలో స్ఫూర్తిని నింపింది అంటూ గిల్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: