ముంబై ఇండియన్స్ కి షాక్.. ప్లే ఆఫ్ కు చేరకుండానే టోర్నీ నుంచి ఔట్?

praveen
ఐపీఎల్ లో ఛాంపియన్ ఫ్రాంచైజీగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కేవలం ఐపిఎల్ లో మాత్రమే కాదు వివిధ దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 టోర్నీలలో కూడా జట్లను కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కేప్ టౌన్ జట్టును కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా t20 లీగ్ హోరాహోరీ గా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ టి 20 టోర్నీలో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకి ఊహించిన షాక్ తగిలింది. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరకుండానే ఆ జట్టు ప్రస్థానం ముగిసింది.

 ఇటీవల ప్రిటోరియ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. ఎమ్ఐ కేప్ టౌన్ జట్టు  కెప్టెన్ కిరాన్ పొలార్డ్ 16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన.. వాండెర్ డసన్ 46 బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ 60 పరుగులు చేసి సత్తా చాటిన ముంబై ఇండియన్స్ కు మాత్రం విజయం వరించలేదు. వీరి పోరాటం వృధాగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో   9 వికెట్లు నష్టానికి 163 పరుగులు చేసింది.

 ఆ తర్వాత లక్ష్య  చేదనకు దిగిన ప్రిటోరియ క్యాపిటల్స్ జట్టు.. 19.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి చివరికి విజయం సాధించింది. డి బ్రూయిన్ 33 బంతుల్లో 42  ముత్తుస్వామి 18 బంతుల్లో 38 నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. ఈ ఓటమితో ఎమ్ఐ కేప్ టౌన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. మొత్తం పది మ్యాచ్లలో మూడు విజయాలు మాత్రమే నమోదు చేసిన ఎంఐ జట్టు  పాయింట్స్ టేబుల్ లో ఐదవ స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను ఈ టీం చేజార్చుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: