అదృష్టం అంటే ఇదే..15 ఏళ్ళకే అంతర్జాతీయ క్రికెట్లోకి?

praveen
అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దేశ వాలి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి రావాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఆటగాళ్లకు ఇలా జాతీయ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాలి అనే కళ చాలా ఏళ్ల పాటు కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఏకంగా కొంతమంది అయితే పాతికేళ్ల వయసులో ఇక జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లకు మాత్రం అతి తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి.

 అతి చిన్న వయసులోనే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా తక్కువ వయసులో ఎవరైనా జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు అంటే చాలు ఆ ప్లేయర్ గురించి అందరూ చర్చించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ మహిళా క్రికెట్ లోకి ఇలాంటి ఒక యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇక జాతీయ జట్టు తరపున ఆడుతూ ఏకంగా వరల్డ్ క్రికెట్లో ప్రస్థానం మొదలుపెట్టింది. జట్టును గెలిపించేందుకు వీరోచితమైన పోరాటం చేసేందుకు సిద్ధమైంది.

 జింబాబ్వే మహిళా క్రికెటర్ బిలావుడ్ బీజ అరుదైన ఘనత సాధించింది.  కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో బీజాకు తుది జట్టులో చోటు దక్కింది. అయితే జింబాబ్వే మహిళా క్రికెట్లో ఆరంగేట్రం చేసిన అతిపిన్నవయస్కురాలిగా ఈమె చరిత్ర సృష్టించింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అతి తక్కువ వయసులో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డు పాకిస్తాన్ ప్లేయర్ సజ్జిధా షా పేరిట ఉంది అని చెప్పాలి. ఈమె కేవలం 12 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ మ్యాచ్ ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: